Hyderabad, జూలై 21 -- సాధారణంగా థియేటర్లలో విడుదలైన కొన్ని రోజులకు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంటాయి. మరికొన్ని సార్లు చాలా అరుదుగా ఓటీటీలో సూపర్ హిట్ అయిన సినిమాలను థియేటర్లలో విడుదల చేస్తుంటారు. ఇలా కాకుండా మొదట బుల్లితెరపై అంటే టీవీల్లో ప్రసారం చేసిన తర్వాత ఓటీటీ రిలీజ్ చేస్తుంటారు.

కాకపోతే, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ నుంచి ఒరిజనల్ సినిమాలుగా, వెబ్ సిరీస్‌లుగా తెరకెక్కిన ఏదైనా సరే ఆ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలోనే రిలీజ్ అవుతుంటాయి. కానీ, ఫర్ ది ఫస్ట్ టైమ్ ఓటీటీ సంస్థ ఒరిజినల్ సినిమాగా తెరకెక్కి ఆ ఓటీటీలో కాకుండా ముందుగా థియేటర్లలో విడుదల కానుంది ఓ సినిమా.

ఆ తెలుగు సినిమానే లిటిల్ హార్ట్స్. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ ఈ అత్యంత అరుదైన కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది. ఈటీవీ విన్ ఒరిజినల్ సినిమాగా లిటిల్ హార్ట్స్ సినిమాను నిర్మించనున్నార...