Hyderabad, ఏప్రిల్ 28 -- ఓటీటీలోకి ఎన్నో రకాల సినిమాలు ఎప్పటికప్పుడు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. థియేటర్లలో విడుదలైన చిత్రాల నుంచి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయ్యే మూవీస్ వరకు ప్రతి వారం సరికొత్త కంటెంట్‌తో దర్శనం ఇస్తూనే ఉంటాయి. వీటిలో హిట్, ఫ్లాప్, డిజాస్టర్స్ అయిన సినిమాలు సైతం ఉంటాయి.

అయితే, కొన్నిసార్లు థియేటర్లలో విడుదలైన సినిమాల బాక్సాఫీస్ ఫలితాలకు, ఓటీటీలో వచ్చే రెస్పాన్స్‌కు సంబంధం ఉండదు. కానీ, కొన్ని మాత్రం బాక్సాఫీస్ వద్ద బాగా ఆడిన చిత్రాలు అదే స్థాయిలో ఓటీటీలో ఆదరణ పొందుతుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునే సినిమా అలాంటిదే. ఆ మూవీనే మ్యాడ్ స్క్వేర్.

2023లో థియేటర్లలో సైలెంట్‌గా రిలీజయి పెద్ద సౌండ్ చేసిన సినిమా మ్యాడ్. దీనికి కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రమే మ్యాడ్ స్క్వేర్. గత నెల అంటే మార్చి 28న భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదలైన మ...