భారతదేశం, అక్టోబర్ 26 -- ఓటీటీలోకి ప్రతివారం ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్‌కు వస్తుంటాయి. వాటిలో కొన్ని మాత్రమే మంచి బజ్ క్రియేట్ చేసి ఆదరణ పొందుతాయి. ఆ తర్వాత ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతాయి. మరికొన్ని ఓటీటీ రిలీజ్ అయిన రోజు నుంచే టాప్‌లో ట్రెండింగ్‌లోకి వస్తుంటాయి. అలాంటి సినిమా గురించే మనం ఇప్పుడు చెప్పుకునేది.

ఆ సినిమానే భద్రకాళి. తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన మరో డిఫరెంట్ మూవీనే భద్రకాళి. డిఫరెంట్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా అటు తమిళంలో, ఇటు తెలుగులో థియేటర్లలో విడుదలైంది ఈ సినిమా. తమిళంలో శక్తి తిరమగన్‌ టైటిల్‌తో రిలీజ్ కాగా తెలుగు రాష్ట్రాల్లో భద్రకాళి పేరుతో విడుదల అయింది.

విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్‌పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పించిన భద్రకాళి మూవీని తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్, రానా దగ్గుబాటి స్పిరిట్ మ...