Hyderabad, ఆగస్టు 10 -- టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ నటించిన తొలి తెలుగు ఓటీటీ వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న ఈ కాప్ సస్పెన్స్ థ్రిల్లర్ కానిస్టేబుల్ కనకం ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. రీసెంట్‌గా ఈ ఓటీటీ థ్రిల్లర్ సిరీస్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు.

ఇటీవల కానిస్టేబుల్ కనకం ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ కనకం ట్రైలర్ తనకు బాగా నచ్చిందని, అసలు విషయం ఏమి చెప్పకుండా ఇంట్రెస్టింగ్‌గా ప్రోమో కట్ చేసిన విధానం నచ్చిందని మెగాస్టార్ చిరంజీవి పొగడ్తల వర్షం కురిపించారు.

కానిస్టేబుల్ కనకం ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉందని, తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోవాలనిపించే విధంగా ప్రతి సన్నివేశాన్ని కట్ చేశారని చిరంజీవి అన్నారు. "ఓటీటీ డామినేషన్ ఉన్న సమయంలో ఇంత స్టైలిష...