Hyderabad, ఆగస్టు 2 -- అచ్చమైన, స్వచ్చమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో 'మోతెవరి లవ్ స్టోరీ' అనే ఓటీటీ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. మై విలేజ్ షో యూట్యూబ్ సిరీస్‌తో పాపులర్ అయిన అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను శివ కృష్ణ బుర్రా రూపొందించారు.

మోతెవరి లవ్ స్టోరీ సిరీస్‌కు మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి, శ్రీరామ్ శ్రీకాంత్ నిర్మాత‌లుగా వ్యవహరించారు. ఏడు ఎపిసోడ్స్‌గా రాబోతోన్న ఈ విలేజ్ కామెడీ, లవ్ సిరీస్ అందరినీ ఆకట్టుకునేలా ఉండబోతోందని ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌తో తెలుస్తోంది.

ఇక ప్రమోషన్స్‌లో భాగంగా శుక్ర‌వారం (ఆగస్టు 1) నాడు మోతెవరి లవ్ స్టోరీ ఓటీటీ సిరీస్ నుంచి 'గిబిలి గిబిలి' అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. హీరోయిన్‌కు త‌న మ‌న‌సులోని ప్రేమ‌ను హీరో వ్య‌క్తం చేసే క్ర‌మంలో 'గిబిలి గిబిలి' పాట వ‌స్తుం...