Hyderabad, మే 9 -- ఓటీటీల హవా పెరిగిపోవడంతో విభిన్నమైన కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి. ఇతర భాషల్లోనే కాదు తెలుగులో సైతం డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో సినిమాలు, సిరీస్‌లను తెరకెక్కిస్తున్నారు. వాటిలో హారర్, బోల్డ్, క్రైమ్, ఇన్వెస్టిగేషన్, కామెడీ వంటి వివిధ జోనర్స్ ఉంటున్నాయి.

అయితే, 2021లో డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన తెలుగు బోల్డ్ వెబ్ సిరీస్ 3 రోజెస్. గ్లామర్ బ్యూటీలు పాయల్ రాజ్‌‌పుత్, ఈషా రెబ్బా, పూర్ణ ప్రధాన పాత్రలు పోషించిన 3 రోజెస్ ఓటీటీలో బాగానే ఆకట్టుకుంది. రొమాంటిక్, కిస్ సీన్లు, బోల్డ్ డైలాగ్స్‌తో 3 రోజెస్ అలరించింది. ఇప్పుడు నాలుగేళ్లకు 3 రోజెస్‌కు సీక్వెల్‌గా సీజన్ 2 రానుంది.

3 రోజెస్ సీజన్ 2 ప్రకటించినప్పటి నుంచి ఆసక్తి నెలకొంది. అయితే, మొదటి సీజన్‌తో పోలిస్తే రెండో సీజన్‌లో ప్రధాన పాత...