Hyderabad, జూన్ 30 -- తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వైవిధ్యభరితమైన చిత్రాలతో సంచలన విజయాలను అందుకుంటోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రాలు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నాయి.

ఇప్పుడు ఈ మూడు సంస్థలు కలిసి మరో విభిన్న చిత్రాన్ని ప్రేక్షకులకు అందించడానికి సిద్ధమవుతున్నాయి. హాస్య చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లరి నరేష్ విభిన్న సినిమాలతోనూ తనదైన ముద్ర వేస్తున్నారు.

అదే కోవలో మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడం కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో చేతులు కలిపారు హీరో అల్లరి నరేష్. 'ఫ్యామిలీ డ్రామా' మూవీ ఫేమ్ మెహర్ తేజ్ ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహిస్తున్నారు. 2021లో అక్టోబర్ 29న థియ...