భారతదేశం, జూలై 21 -- ఓటీటీలో తమిళ థ్రిల్లర్ మూవీ డీఎన్ఏ (DNA) దూసుకెళ్తోంది. పసి పాపల అక్రమ రవాణా కథాంశంగా సాగే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. ఈ తమిళ మూవీ గ్రిప్పింగ్ స్టోరీ లైన్ తో, ట్విస్ట్ లతో ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేస్తోంది. అయితే తెలుగులో థియేటర్లలో రిలీజైన ఒక్క రోజులోనే ఈ సినిమా ఓటీటీలోకి రావడం గమనార్హం.

తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన డీఎన్ఏ తెలుగులో మై బేబీ టైటిల్ తో రిలీజ్ అయింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ జులై 18న తెలుగులో రిలీజైంది. ఆ తర్వాతి రోజు అంటే జులై 19న ఓటీటీలోకి వచ్చేసింది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మై బేబీ సినిమాలో అధర్వ మురళి, నిమిషా సజయన్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. డీఎన్ఏకు నెల్సన్‌ వెంకటేశన్‌ దర్శకత్వం వహించారు.

డీఎన్ఏ సినిమా తమిళంలో జూన్...