భారతదేశం, ఆగస్టు 23 -- ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో థ్రిల్లర్ సినిమాలు జోరు కొనసాగుతోంది. ఈ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో టాప్-5 సినిమాల్లో మూడు థ్రిల్లర్లే ఉన్నాయి. ఇందులో స్పై థ్రిల్లర్ నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. మరో హారర్, కోర్టు థ్రిల్లర్లు కూడా ఇందులో ఉన్నాయి.

స్పై యాక్షన్ థ్రిల్లర్ 'టెహ్రాన్'. జాన్ అబ్రహం లీడ్ రోల్ ప్లే చేశాడు. జీ5 ఓటీటీలో ఇది నంబర్ వన్ లో ట్రెండ్ అవుతోంది. ఈ స్పై థ్రిల్లర్ ఆడియన్స్ ను అలరిస్తోంది. ఈ థ్రిల్లర్ హిందీ, ఇంగ్లీష్ లో అందుబాటులో ఉంది. 2012లో ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. దీని వెనుకు ఉన్నవాళ్లను అంతం చేయడానికి స్పెషల్ ఆఫీసర్ టెహ్రాన్ కు వెళ్తాడు. చివరకు ఏం జరిగిందన్నదే కథ. ఈ మూవీకి అరుణ్ గోపాలన్ డైరెక్టర్.

తన కొడుకు కంపెనీలో తల్లి పార్ట్ టైమ్ జాబ్ లో చేరితే ఎలా ఉంటుందనే కథతో వచ్చిన బెంగా...