భారతదేశం, ఏప్రిల్ 27 -- బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ లీడ్ రోల్ చేసిన జువెల్ తీఫ్ సినిమా మంచి అంచనాలతో వచ్చింది. థియేటర్లలో కాకుండా నేరుగా ఈ మూవీ ఓటీటీలోకి వస్తుండటంతో మరింత క్యూరియాసిటీ నెలకొంది. ఈ హీస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి కూకీ గులాటీ, రాబీ గ్రేవాల్ దర్శకత్వం వహించారు. జువెల్ తీఫ్ జైదీప్ అహ్లావత్, నిఖితా దత్తా కూడా ముఖ్యమైన రోల్స్ చేశారు. ఈ జువెల్ తీఫ్ చిత్రం ట్రెండింగ్‍లో ఎట్టకేలకు టాప్‍కు వచ్చింది.

జువెల్ తీఫ్ చిత్రం ఏప్రిల్ 25న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, ఇంగ్లిష్ భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా నెట్‍ఫ్లిక్స్‌లోకి ఈ చిత్రం ఎంట్రీ ఇచ్చింది. ఓటీటీలోకి వచ్చిన రెండు రోజుల్లో ఈ మూవీ సినిమా ట్రెండింగ్ జాబితాలో టాప్ ప్లేస్‍కు వచ్చింది. ప్రస్తుతం (ఏప్...