Hyderabad, మే 31 -- ఓటీటీ రెస్పాన్స్‌కు థియేటర్ల టాక్‌కు భిన్నంగా సినిమాల ఫలితాలు ఉంటాయి. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. థియేటర్లలో డిజాస్టర్స్‌గా నిలిచిన ఎన్నో సినిమాలు ఓటీటీలో మాత్రం దుమ్ములేపుతుంటాయి. అలాగే, కొన్నిసార్లు మాత్రం బాక్సాఫీస్ కలెక్షన్స్‌తో అదరగొట్టిన మూవీస్ సైతం ఓటీటీలో మిశ్రమ స్పందన తెచ్చుకుంటాయి.

ఏ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో ఇటీవల కాలంలో చెప్పలేకుండా ఉంది. ఇదిలా ఉంటే, రీసెంట్‌గా ఓ సినిమా కూడా ఇలాంటి రెండు విభిన్నమైన ఫలితాలను చవిచూసింది. రూ. 200 కోట్ల బడ్జెట్ పెట్టిన తీసిన ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడిపోయింది. కానీ, ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాక మాత్రం దంచికొడుతోంది.

ఆ సినిమా మరేదో కాదు సికందర్. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తొలిసారి జోడి కట్టిన సినిమా ఇది. అలాగే, ఇందులో బ్యూటిఫుల్ కా...