భారతదేశం, జనవరి 5 -- ఓటీటీలో ప్రతివారం ఎక్కువ వ్యూస్ వచ్చిన సినిమాల జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేస్తున్న విషయం తెలుసు కదా. గతవారం అంటే డిసెంబర్ 29 నుంచి జనవరి 4 మధ్య కూడా ఏ సినిమాకు ఎక్కువ వ్యూస్ వచ్చాయో తేలిపోయింది. అయితే టాప్ 5 జాబితాలో రవితేజ డిజాస్టర్ మాస్ జాతర కూడా ఉండటమే ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఓటీటీ టాప్ 5 సినిమాల విషయానికి వస్తే రష్మిక మందన్న నటించిన హారర్ కామెడీ మూవీ థామా తొలి స్థానంలో కొనసాగుతోంది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు గతవారం 2.3 మిలియన్ల వ్యూస్ నమోదు కావడం విశేషం. రెండో స్థానంలో జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఏక్ దీవానే కీ దీవానియత్ నిలిచింది. ఈ మూవీకి 2.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

మూడో స్థానంలో నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన హక్ మూవీ ఉంది. ఈ మూవీకి 2 మిలియన్ల వ్యూస్ నమోదయ్యాయి. నెట్‌ఫ్లిక్స్ లోనే ఉ...