Hyderabad, జూలై 28 -- ఓటీటీ హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. డిఫరెంట్ కంటెంట్‌తో భయపెట్టే సీన్లు, థ్రిల్లింగ్ ట్విస్టులతో సాగే హారర్ మూవీస్ అంటే ఓటీటీ ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టం చూపిస్తుంటారు. అందుకే అవి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటాయి. ఇక వీటికి అదనంగా మరికొన్ని అంశాలు యాడ్ చేసి తెరకెక్కిస్తే మరింతగా రచ్చ చేస్తుంటాయి.

అలా రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన న్యూ హారర్ థ్రిల్లర్ మూవీ దూసుకుపోతోంది. ఏకంగా టాప్ 1 ఓటీటీ ట్రెండింగ్‌లో సత్తా చాటుతోంది. ఆ సినిమానే అంటిల్ డాన్ (Until Dawn). సాయంత్రం వరకు అనే అర్థం వస్తుంది. ఈ సినిమాను హారర్ అంశాలతో పాటు సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు.

అమెరికన్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన అంటిల్ డాన్ మూవీ ఏప్రిల్ 25న యూనైటెడ్ స్టేట్స్‌లో విడుదల చేశారు. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు రెస్పాన్స్ విప...