Hyderabad, ఏప్రిల్ 26 -- ఓటీటీలోకి ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో సినిమాలు స్ట్రీమింగ్‌కు వస్తూనే ఉంటాయి. వాటిలో ఎక్కువగా హారర్, క్రైమ్, కామెడీ జోనర్ సినిమాలను ఓటీటీ ఆడియెన్స్ అమితంగా ఇష్టపడుతుంటారు. ఇక క్రైమ్ థ్రిల్లర్స్‌కు బోల్డ్ సీన్స్ యాడ్ చేసి తెరకెక్కిస్తే మరింత ఆదరణ పొందుతుంటాయి.

ఇక ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత చాలా రోజుల వరకు కూడా కొన్ని సినిమాలు ట్రెండింగ్‌లో, టాప్‌లో దూసుకుపోతుంటాయి. ఇప్పుడు అలా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చి చాలా రోజులు అయినప్పటికీ టాప్‌లో సత్తా చాటుతున్న ఓ సినిమా గురించి తెలుసుకుందాం.

ప్రస్తుతం ఓటీటీ టాప్ మూవీస్‌లో దూసుకుపోతోన్న సినిమా ఫైర్. తమిళంలో బోల్డ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా ఫైర్. ఈ సినిమాలో ఫిజియోథెరపిస్ట్‌గా పని చేసే డాక్టర్ తన క్లినిక్‌కు వచ్చిన లేడి పేషంట్స్‌తో సంబంధాలు పెట్టుకుంట...