భారతదేశం, మే 14 -- థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వారు భాషతో సంబంధం లేకుండా సినిమాలు చూస్తుంటారు. థ్రిల్లర్లు ఉత్కంఠభరితంగా సాగితే వేరే భాషల సినిమాలైనా సబ్‍టైటిల్స్ పెట్టుకొని మరీ వీక్షిస్తుంటారు. అలాంటి వారి కోసమే కన్నడలో వచ్చిన థ్రిల్లర్లలో ఐదు బెస్ట్ ఆప్షన్లు ఇవి. కన్నడలో చాలా థ్రిల్లర్లు వచ్చాయి. అందులో కొన్ని గ్రిప్పింగ్‍గా ఉంటూ ఆకట్టున్నాయి. వాటిలో మిస్ కాకుండా చూడాల్సిన ఐదు సినిమాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 'బీర్బల్ ట్రయాలజీ కేస్ 1' (2019) ఇంట్రెస్టింగ్‍గా సాగుతుంది. ఎంజీ శ్రీనివాస్, రుక్మిణి వసంత్, వినీత్ కుమార్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ద్వారానే రుక్మిణి తెరంగేట్రం చేశారు. ఓ హత్య గురించి విష్ణు ఓ బార్ టెండర్ పోలీసులకు సమాచారం ఇస్తాడు. అయితే, ఈ కేసులో అతడినే పోలీసులు అరెస్ట్ చేస్తారు. కోర్టు శ...