Hyderabad, జూలై 25 -- ప్రతి వీకెండ్ లాగే ఈ వీకెండ్ కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో చూడటానికి కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ఈవారం మొదటి నుంచి శుక్రవారం (జులై 25) వచ్చిన వివిధ ఓటీటీల్లోకి వచ్చిన ఆ సినిమాలేంటి? ఎక్కడ చూడాలో ఇక్కడ తెలుసుకోండి.

నవీన్ చంద్ర నటించిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ షో టైమ్. ఈ సినిమా సన్ నెక్ట్స్, ప్రైమ్ వీడియో ఓటీటీల్లో శుక్రవారం (జులై 25) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఓ కామన్ మ్యాన్, పోలీస్ అధికారి ఈగోల చుట్టూ తిరిగే కథ ఇది. నవీన్ చంద్రతోపాటు కామాక్షి భాస్కర్ల, రాజా రవీంద్రలాంటి వాళ్లు నటించారు. ఈ సినిమా తమిళంలోనూ అందుబాటులో ఉంది.

హిందీతోపాటు తెలుగు, ఇతర సౌత్ ఇండియన్ భాషల్లో రిలీజైన యాక్షన్ థ్రిల్లర్ మూవీ సర్జమీన్ (Sarzameen). శుక్రవారమే జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. మలయాళం స్టార్ పృథ్వీ...