Hyderabad, జూన్ 30 -- ఓటీటీల్లో గత వారం ఎక్కువ మంది చూసిన సినిమాలు, వెబ్ సిరీస్ ఏవో తెలుసా? ఆర్మాక్స్ మీడియా తాజాగా గత వారానికి సంబంధించిన జాబితాను రిలీజ్ చేసింది. దీని ప్రకారం జూన్ 23 నుంచి జూన్ 29 వరకు ఎక్కువ మంది చూసిన టాప్ 5 సినిమాలు, టాప్ 5 వెబ్ సిరీస్ ఏవో చూద్దాం. ఇండియన్ ఆడియెన్స్, అందులోనూ కనీసం 30 నిమిషాల పాటు చూసిన వాటినే లెక్కలోకి తీసుకొని ఈ జాబితాను తయారు చేశారు.

ఆర్మాక్స్ మీడియా ప్రకారం ఓటీటీల్లో ఎక్కువ మంది చూసిన సినిమాల విషయానికి వస్తే వీటిలో హిందీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రైడ్ 2 (Raid 2) తొలి స్థానంలో ఉంది. ఈ సినిమాను గత వారం 4.1 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అజయ్ దేవగన్, రితేష్ దేశ్‌ముఖ్ నటించిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక రెండో స్థానంలో అక్షర్ కుమార్ నటించిన మరో హిందీ మూవీ కేసరి ఛాప్టర్ 2 ఉంది.

జియోహాట్‌స...