Hyderabad, సెప్టెంబర్ 8 -- ఓటీటీల్లో ప్రతివారం ఎక్కువ మంది చూసిన మూవీస్, వెబ్ సిరీస్ జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసే విషయం తెలుసు కదా. తాజాగా గత వారానికి సంబంధించిన జాబితాను సోమవారం (సెప్టెంబర్ 8) రిలీజ్ చేసింది. వీటిలో అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్, నెట్‌ఫ్లిక్స్ లలో స్ట్రీమింగ్ అయ్యే సిరీస్ లు ఉన్నాయి.

రైజ్ అండ్ ఫాల్ ఓ రియాలిటీ షో. అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. అష్నీర్ గ్రోవర్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో 16 మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు. ఈ మధ్యే ఈ షో మొదలైంది. ఇందులో టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ కూడా పాల్గొంటోంది. ఈ షోకి గత వారం 3.8 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. టాప్ లో ఉంది.

ఇక అదే అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లోకి ఈ మధ్యే వచ్చిన మరో టీవీఎఫ్ వెబ్ సిరీస్ హాఫ్ సీఏ సీజన్ ...