Hyderabad, సెప్టెంబర్ 2 -- నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో గత వారం ఎక్కువ మంది చూసిన సినిమాల జాబితా వచ్చేసింది. వీటిలో తెలుగు మూవీ కింగ్డమ్ టాప్ లో నిలవడం విశేషం. అంతేకాదు టాప్ 5లో రెండు తెలుగు, రెండు తమిళ సినిమాలు ఉండగా.. ఒకే ఒక్క హిందీ హారర్ సినిమాకు చోటు దక్కింది.

ఈ జాబితాలో విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ తొలి స్థానంలో నిలిచింది. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు థియేటర్లలో అంతంతమాత్రం రెస్పాన్స్ రాగా.. ఓటీటీలో మాత్రం టాప్ లో దూసుకెళ్తోంది. నిజానికి నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ లోనూ ఈ కింగ్డమే టాప్ లో ఉండటం విశేషం. ఈ సినిమాకు గత వారం 2.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ కేవలం రూ.80 కోట్లు మాత్రమే వసూలు చేసి నిర్మాతలకు భారీ నష్టాన్ని మిగిల్చిన విషయం...