Hyderabad, జూలై 28 -- ఓటీటీల్లోకి ప్రతివారం కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ వస్తాయన్న విషయం తెలుసు కదా. మరి వీటిలో ఆయా వారాల్లో ఎక్కువ మంది చూసిన మూవీస్, సిరీస్ ఏవో తెలుసుకోండి. గత వారానికి సంబంధించి ఆర్మాక్స్ మీడియా (Ormax Media) ఈ టాప్ 5 మూవీస్, వెబ్ సిరీస్ జాబితాను సోమవారం (జులై 28) రిలీజ్ చేసింది.

ఓటీటీల్లో గత వారం అంటే జులై 21 నుంచి 27 వరకు ఎక్కువ మంది చూసిన సినిమాల జాబితా ఇలా ఉంది. తొలి స్థానంలో జియోహాట్‌స్టార్ లోకి నేరుగా వచ్చిన సర్జమీన్ (Sarzameen) మూవీ నిలిచింది. ఈ సినిమాకు గత వారం 4.5 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, కాజోల్ లీడ్ రోల్స్ లో నటించారు. తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమాకు ఈ స్థాయి వ్యూస్ వచ్చాయి. నిజానికి ఈ మూవీకి నెగటివ్ రివ్యూలే ఎక్కువగా వచ్చాయి.

ఇక రెండో స్థానంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్...