భారతదేశం, మే 3 -- ఓటీటీల్లో ఈ వారం తెలుగులో కొత్త కంటెంట్ చూడాలనుకుంటున్నారా.. అయితే తాజాాగా కొన్ని ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈవారం (ఏప్రిల్ 28 - మే 3) తెలుగులో నాలుగు చిత్రాలు వివిధ ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చాయి. నవీన్ చంద్ర హీరోగా నచించిన ఓ థ్రిల్లర్ మూవీ ఇందులో ఉంది. ఓ తెలుగు మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఓ మలయాళ సినిమా డబ్బింగ్‍లోనూ వచ్చింది. ఈ వారం తెలుగులో ఓటీటీల్లోకి వచ్చిన 4 లేటెస్ట్ సినిమాలు, ఓ సిరీస్ ఇవే..

తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం 28 డిగ్రీస్ సెల్సియస్ సినిమా ఏప్రిల్ 29వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి అడుగుపెట్టింది. నవీన్ చంద్ర హీరోగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 4న థియేటర్లలో రిజైంది. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ అనుకున్న రేంజ్‍లో కలెక్షన్లను దక్కించుకోలేకపోయింది. థియేటర్లలో రిలీజైన నెలలోగానే ...