భారతదేశం, ఏప్రిల్ 26 -- ఓటీటీల్లో కొత్తగా తెలుగులో వచ్చిన సినిమాలు చూడాలనుకుంటే.. ఈ వీకెండ్‍కు అదిరిపోయే చిత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ వారం తెలుగులో కొన్ని సినిమాలు ఎంట్రీ ఇచ్చాయి. వాటిలో ఐదు చాలా ఇంట్రెస్టింగ్‍గా ఉన్నాయి. ఇందులో ఒకటి తెలుగు సూపర్ హిట్ కామెడీ మూవీ ఉంది. మిగిలిన నాలుగు సినిమాలు తెలుగు డబ్బింగ్‍లో అందుబాటులోకి వచ్చాయి. ఈ ఐదు సినిమాలు తప్పకుండా చూడాల్సినవే. ఈ వారం తెలుగులో ఓటీటీల్లోకి వచ్చిన ఐదు ఇంట్రెస్టింగ్ చిత్రాలు ఏవో ఇక్కడ తెలుసుకొని.. వీకెండ్ ఎంజాయ్ చేయండి.

తెలుగు కామెడీ ఎంటర్‌టైనర్ మ్యాడ్ స్క్వేర్ ఈ శుక్రవారం ఏప్రిల్ 25వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మార్చి 28వ తేదీన థియేటర్లలో రిలీజై.. రూ.70కోట్లకు పైగా కలెక్షన్లతో స...