భారతదేశం, మే 5 -- వివిధ ఓటీటీల్లోకి ఆ వారం (మే 5 నుంచి మే 10) కూడా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‍లు అడుగుపెట్టేందుకు రెడీ అయ్యాయి. కొత్త కంటెంట్ చూడాలనుకునే వారి కోసం అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. వీటిలో ఆరు రిలీజ్‍లు ఎక్కువ ఆసక్తికరంగా ఉన్నాయి. సూపర్ హిట్ తమిళ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా ఇదే వారంలో రానుంది. రెండు తెలుగు చిత్రాలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. రెండు ఇంట్రెస్టింగ్ సిరీస్‍లు ఉన్నాయి. ఈ వారం ఓటీటీల్లో ఆరు ముఖ్యమైన రిలీజ్‍లు ఇవే..

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన గుడ్‍ బ్యాడ్ అగ్లీ సినిమా మే 8వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ యాక్షన్ మూవీ తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైంది. సుమారు రూ.300కోట...