Hyderabad, సెప్టెంబర్ 22 -- ఓటీటీల్లో ప్రతివారం ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ వస్తూనే ఉంటాయి. కానీ కొన్ని మాత్రమే వారాల పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ టాప్ లో నిలుస్తుంటాయి. అలాంటి మూవీస్ జాబితాను ఆర్మాక్స్ మీడియా ప్రతివారం రిలీజ్ చేస్తూనే ఉంటుంది. తాజాగా సెప్టెంబర్ 15 నుంచి 21 మధ్య వారానికి సంబంధించిన తాజా లిస్టు వచ్చేసింది.

అంతకుముందు వారంలాగే గత వారం కూడా ఓటీటీల్లో ఎక్కువ మంది చూసిన సినిమాల జాబితాలో సయ్యారా, కూలీనే నిలిచాయి. ఈ రెండూ బాక్సాఫీస్ దగ్గర రూ.500 కోట్ల క్లబ్ మార్క్ అందుకున్న సినిమాలే. ఇప్పుడు ఓటీటీలోనూ అలాగే దూసుకెళ్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న సయ్యారాకు తిరుగు లేకుండా పోయింది. గతవారం ఈ సినిమాకు ఏకంగా 6 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. నెట్‌ఫ్లిక్స్ లో యువ ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి ఆదర...