భారతదేశం, మే 22 -- ఓటీటీల్లో కొత్త సినిమాలు చూడాలనుకునే వారు రెడీగా ఉండండి.. రేపు (మే 23) మరిన్ని స్ట్రీమింగ్‍కు రానున్నాయి. వీటిలో ఐదు చిత్రాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ప్రియదర్శి హీరోగా నటించిన తెలుగు కామెడీ మూవీ రేపే ఓటీటీలోకి వచ్చేయనుంది. మలయాళం, తమిళంలోనూ సినిమాలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. రేపు ఓటీటీల్లోకి రానున్న ఐదు సినిమాలు ఏవంటే..

తెలుగు కామెడీ థ్రిల్లర్ సినిమా 'సారంగపాణి జాతకం' రేపు (మే 23) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ ఎంట్రీ ఇవ్వనుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజైంది. నెలలోగానే ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చేస్తోంది.

సారంగపాణి జాతకం మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ సినిమాలో ప్రియదర్శితో పాటు రూప కొండు...