భారతదేశం, ఏప్రిల్ 28 -- మేలో వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో మరిన్ని తెలుగు చిత్రాలు రానున్నాయి. ఏప్రిల్‍లో థియేటర్లలోకి వచ్చి నిరాశపరిచిన కొన్ని సినిమాలు కూడా ఎంట్రీ ఇవ్వనున్నాయి. జాక్, ఓదెల 2తో పాటు మరిన్ని సినిమాలు స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనున్నాయి. మేలో ఓటీటీల్లోకి రానున్న 5 ముఖ్యమైన తెలుగు చిత్రాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన రాబిన్‍హుడ్ సినిమా మార్చి 28వ తేదీన థియేటర్లలో విడుదలైంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో మంచి అంచనాలతో వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకొని ప్లాఫ్ అయింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ దగ్గర ఉన్నాయి. మే తొలివారంలోనే ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్‍కు రానుంది. డేట్‍ను త్వరలోనే జీ5 వెల్లడించనుంది. మే 2వ తేదీ లేకపోతే మే 5న జీ ఓటీటీలో రాబిన్‍హుడ్ స్ట్రీమింగ్...