భారతదేశం, జూన్ 23 -- పంచాయత్ వెబ్ సిరీస్‍లో ఇప్పటికే వచ్చిన మూడు సీజన్లు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు నాలుగో సీజన్ సిద్ధమైంది. ఈ సీక్వెల్ సీజన్ ఈ వారమే వచ్చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉన్న స్విడ్ గేమ్ వెబ్ సిరీస్‍కు కూడా నయా సీజన్ అడుగుపెడుతోంది. మూడో సీజన్ ఈ వారమే స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ రెండు సిరీస్‍ల సీక్వెల్స్ స్ట్రీమింగ్ సహా మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి.

'పంచాయత్' వెబ్ సిరీస్‍లో నాలుగో సీజన్ ఈ వారమే జూన్ 24వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ రూరల్ కామెడీ డ్రామా సిరీస్‍లో నాలుగో సీజన్‍కు దీపక్ కుమార్, మిశ్రా, అక్షత్ విజయ్ వర్గీయ దర్శకత్వం వహించారు. జితేంద్ర కుమార్ ప్రధాన పాత్రలో కొనసాగారు. నీనా గుప్తా, రఘువీర్ యాదవ్, ఫైజల్ మాలిక్, చంద్రన్ రాయ్ కీలకపాత్రలు పోషించారు.

ఫులేరా అనే గ్రామంలో పంచా...