భారతదేశం, జూలై 7 -- ఓటీటీల్లో కొత్త మలయాళ చిత్రాలు చూడాలనుకుంటున్నారా.. అయితే, ఈ వారం మూడు సినిమాలు స్ట్రీమింగ్‍కు వచ్చేయనున్నాయి. టొవినో థామస్ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం 'నరివెట్ట' ఈ వారమే స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. మరో రెండు మలయాళ చిత్రాలు స్ట్రీమింగ్‍కు రానున్నాయి. ఈ జూలై రెండో వారం ఓటీటీల్లోకి రానున్న మూడు మలయాళ సినిమాలు ఏవంటే..

మలయాళ యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ 'నరివెట్ట' ఈ శుక్రవారం (జూలై 11) సోనీలివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. టొవినో థామస్ హీరోగా నటించిన ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి వస్తుంది. ఈ విషయంపై సోనీలివ్ అధికారిక ప్రకటన చేసింది.

నరివెట్ట చిత్రం మే 23వ తేదీన థియేటర్లలో విడుదలైంది. పాజిటివ్ టాక్ దక్కించుకొని హిట్‍గా నిలిచింది. రూ.10కోట్ల బడ్జెట్‍తో రూపొ...