భారతదేశం, మే 6 -- ఓటీటీల్లోకి కొత్త మలయాళ చిత్రాల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా బాగా పాపులర్ అయిన సూపర్ హిట్ చిత్రాలను ఓటీటీలో చూడాలని అనుకుంటుంటారు. మలయాళ చిత్రాలు ఎక్కువగా ఇతర భాషల్లోనూ ఓటీటీలోకి వస్తుంటాయి. ఈ మే నెలలో ఓటీటీల్లో రెండు మలయాళ సినిమాలకు ఎక్కువ క్రేజ్ కనిపిస్తోంది. అవే 'మరణమాస్', 'తుడరుమ్'. ఈ రెండు బ్లాక్‍బస్టర్ చిత్రాలు ఇదే నెలలో ఓటీటీల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి.

మలయాళ హీరో బాసిల్ జోసెఫ్.. తెలుగులోనూ బాగా పాపులర్ అయ్యారు. ఓటీటీల్లో తెలుగు డబ్బింగ్‍లో జోసెఫ్ నటించిన చిత్రాలకు మంచి క్రేజ్ కనిపిస్తుంది. బాసిల్ జోసెఫ్ హీరోగా చేసిన 'మరణమాస్' సిసిమా మే 15వ తేదీన సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. మలయాళంలో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. థియేటర్లలో మలయాళంలో ఒక్...