Hyderabad, జూలై 17 -- 2025 ప్రథమార్థం ముగియడంతో ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద ఏ సినిమాలు హిట్ కొట్టాయి, ఏ మూవీస్ ఫ్లాప్ అయ్యాయనే విషయంపై ఆసక్తి నెలకొంది. రష్మిక మందన్న ఛావా మూవీ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఎల్ 2: ఎంపురాన్ మూవీని బాక్సాఫీస్ వద్ద డామినేట్ చేసింది.

అలాగే, తుడరం, ఆమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ వంటి సినిమాలు కూడా కొంత ప్రశంసలు అందుకున్నాయి. అయితే బాక్సాఫీస్ కలెక్షన్ రిపోర్టుల ప్రకారం రికార్డులు బద్దలు కొడుతున్న సినిమాలు డామినేట్ చేసినప్పటికీ స్టార్స్ లేని ఒక చిన్న మూవీ లాభాల పరంగా వాటన్నింటిని అధిగమించి సత్తా చాటింది.

2025లో ఇండియాలోనే అత్యంత లాభదాయకమైన చిత్రంగా నిలిచింది. ఆ సినిమా ఇంకేదో కాదు తమిళ కామెడీ ఫ్యామిలీ డ్రామా సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ. ఈ ఏడాది ఇప్పటివరకు అత్యంత లాభాలు తీసుకొచ్చిన భారతీయ చిత్రంగా టూరిస్ట్ ఫ్యామిలీ నిలిచిం...