భారతదేశం, డిసెంబర్ 23 -- 2025కు మరో వారంలో ఎండ్ కార్డు పడబోతుంది. కొత్త ఏడాది రెడీ అవుతోంది. ఈ 2025లో ఎన్నో వేల సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. ఇందులో డిఫరెంట్ జోనర్లు సినిమాలున్నాయి. అయితే 2025లో అత్యధిక మంది చూసిన తమిళ సినిమా ఏదో మీకు తెలుసా? అదే మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ 'ఎలెవన్'. ఇది ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

2025లో ఓటీటీలో అత్యధిక మంది చూసిన తమిళ సినిమాగా ఎలెవన్ నిలిచింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ లో నవీన్ చంద్ర హీరో. ఇది ప్రైమ్ వీడియో, ఆహా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రైమ్ వీడియోలో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఆహాలో తెలుగు, తమిళంలో చూడొచ్చు.

ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ఎలెవన్ మే 16, 2025న థియేటర్లలో రిలీజైంది. తమిళంతో పాటు తెలుగులోనూ థియేటర్లకు ...