భారతదేశం, జనవరి 2 -- దళపతి విజయ్ తన చివరి సినిమాగా చెబుతున్న జన నాయగన్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలుసు కదా. ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ఈ మధ్యే అంటే డిసెంబర్ 27న మలేషియాలో జరిగింది. ఆ ఈవెంట్ ను లైవ్ స్ట్రీమింగ్ చేయలేదు. కానీ ఇప్పుడది ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

జన నాయగన్ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ ను జీ5 ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతోంది. ఇది ఆదివారం అంటే జనవరి 4న సాయంత్రం 4.30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ వెల్లడించింది.

"బిగ్గెస్ట్ సౌత్ ఈవెంట్ ఆఫ్ ద ఇయర్.. ఒక ఐకాన్. ఒక చివరి గర్జన. ఒక మరచిపోలేని రాత్రి.. దళపతి తిరువీర జన నాయగన్ ఆడియో లాంచ్ జనవరి 4న జీ5లో ప్రీమియర్ కానుంది" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ఈవెంట్ కు సంబంధించి చిన్న టీజర్ కూడా జోడించింది.

ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ లో దళపతి విజయ్ ఇంట్ర...