Hyderabad, జూన్ 30 -- ఓటీటీ హారర్ థ్రిల్లర్స్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. రొటీన్ స్టోరీ అయిన టేకింగ్ ఎంత థ్రిల్లింగ్‌గా, భయపెట్టేలా ఉంటే అంత హిట్ అవుతాయి. ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్, ఎప్పుడు చూడని సన్నివేశాలతో మలిస్తే ఆ హారర్ మూవీకి వచ్చే రెస్పాన్స్ మరోలా ఉంటుంది.

అలాంటి హారర్ థ్రిల్లర్ సినిమానే ది మంకీ. ఇది ఒక అమెరికన్ డార్క్ కామెడీ హారర్ థ్రిల్లర్ సినిమా. కానీ, ఇందులో ఎక్కువగా హారర్ అంశాలే ఎక్కువగా ఉంటాయి. ఒక కోతి బొమ్మ చుట్టూ ఈ సినిమా అంత సాగుతుంది. ఒక ఫ్యామిలీలో ఓ కోతి బొమ్మ ఉంటుంది. అది డ్రమ్ వాయించే కోతి బొమ్మ.

ఆ బొమ్మకు కీ ఇస్తే డ్రమ్ వాయిస్తుంది. కానీ, కొన్నిసార్లు ఎలాంటి కీ ఇవ్వకుండానే డ్రమ్ వాయిస్తుంది. అలా చేసిందంటే ఒకరు అతి ఘోరంగా, ఊహించని విధంగా చనిపోతారు. ఇది హీరో కుటుంబానికి శాపంగా ఉంటుంది. ఆ కోతి బొమ్మ వల్ల తన ఫ్యామిలీలో ఒ...