భారతదేశం, జూలై 12 -- మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జీవితాలను చక్కగా చూపిస్తూ.. మధ్య తరగతి ప్రజల ఎమోషన్ ను కళ్లకు కట్టిన తమిళ సినిమా ఓటీటీలో అదరగొడుతోంది. ఒకే రోజు నాలుగు ఓటీటీల్లో రిలీజైన ఈ మూవీ ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. మిడిల్ క్లాస్ లైఫ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన మద్రాస్ మ్యాట్నీ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తాచాటుతోంది. ఈ సినిమా ప్రతి మనిషిని కదిలిస్తోంది.

2025 జూన్ 6న థియేటరల్లో రిలీజైంది మద్రాస్ మ్యాట్నీ. థియేటర్లలో ఈ తమిళ్ ఫ్యామిలీ డ్రామాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాజిటివ్ టాక్ తో ఈ మూవీ అదరగొట్టింది. జూలై 4న ఈ ఫిల్మ్ ఓటీటీలోకి వచ్చింది. ఒకే రోజు సన్ నెక్ట్స్, టెంట్ కోటా, ప్రైమ్ వీడియో, సింప్లీ సౌత్ ఓటీటీల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

మద్రాస్ మ్యాట్నీ మూవీ ఓటీటీలో సత్తాచాటుతోంది. ఆడియన్స్ తో శభాష్ అనిపించుకుంటోంది. ట్రెండిం...