Hyderabad, ఏప్రిల్ 18 -- సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఏ ముహూర్తంలో రిలీజైందోగానీ అప్పుడు థియేటర్లలో, తర్వాత ఓటీటీలోనూ తిరుగులేని రికార్డులను సొంతం చేసుకుంటోంది. వెంకటేశ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించిన ఈ సినిమా తాజాగా జీ5 ఓటీటీలో కళ్లు చెదిరే రికార్డును సొంతం చేసుకుంది. మరి ఆ రికార్డు ఏంటో చూడండి.

సంక్రాంతికి వస్తున్నాం మూవీ జీ5 ఓటీటీలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకూ 500 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును అందుకుంది. గతంలో కేవలం ఆర్ఆర్ఆర్ మూవీకి మాత్రమే దక్కిన ఘనత ఇది. ఆ సినిమా ఒక బిలియన్ కు పైగా స్ట్రీమింగ్ మినట్స్ నమోదు చేసింది.

తాజాగా సంక్రాంతికి వస్తున్నాం ఈ అరుదైన మైలురాయిని అందుకున్నట్లు జీ5 ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. "గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు బ్రేకింగ్ 500 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్...