భారతదేశం, డిసెంబర్ 6 -- ఓటీటీ సినీ ప్రియులకు ఈ వారం అనేక స్ట్రీమింగ్ సినిమాలతో పండగ వాతావరణం నెలకొంది. థియేటర్ దాకా వెళ్లే ఓపిక లేక ఇంట్లోనే కూర్చుని వీకెండ్‌ను ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఓటీటీల్లోనూ బోలెడన్ని ఆప్షన్లు ఉన్నాయి. అయితే, ఓటీటీలో ఈ వీకెండ్‌కు చూడాల్సిన 6 ఇంట్రెస్టింగ్ టాలీవుడ్ టు హాలీవుడ్ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్ నుంచి వచ్చిన లేటెస్ట్ సినిమా థామా. ఇందులో రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించారు. ఒక పిశాచం (Vampire) కాటు వేయడంతో ఆయుష్మాన్ ఖురానా జీవితం ఎలాంటి ఊహించని మలుపులు తిరిగిందనేది ఈ చిత్ర కథాంశం.

విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేష్ రావల్ కూడా ఇందులో కీలక పాత్రలు పోషించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అద్దె ప్రాతిపదికన (Rent) థామా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో ఓటీటీ రిలీజ్...