భారతదేశం, సెప్టెంబర్ 4 -- ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన హారర్ ఫ్రాంచైజీలలో ది కాంజురింగ్ యూనివర్స్ ఒకటి. ఇప్పుడు ది కాంజురింగ్: లాస్ట్ రైట్స్ తో దీనికి ఎండ్ కార్డు పడనుంది. 2013లో ది కంజురింగ్ తో మొదలైన ఈ ఫ్రాంచైజీ ఆ తర్వాత అనబెల్లె, ది నన్ అనే రెండు వేర్వేరు సబ్ ఫ్రాంచైజీలకు విస్తరించింది. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు, రచయితలు ఎడ్, లోరైన్ వారెన్ నిజ జీవిత కథల ఆధారంగా ఈ ఫ్రాంచైజీ రూపొందించబడింది, ఇందులో పాట్రిక్ విల్సన్, వెరా ఫార్మిగా నటించారు. మొత్తం కాంజురింగ్ యూనివర్స్ లో 8 సినిమాలున్నాయి.

ది కాంజురింగ్: లాస్ట్ రైట్స్ మూవీ శుక్రవారం (సెప్టెంబర్ 5) థియేటర్లలో రిలీజ్ కానుంది. అంతకంటే ముందు కాంజురింగ్ యూనివర్స్ లో ఉన్న హారర్ థ్రిల్లర్లు ఈ ఓటీటీల్లో చూడొచ్చు. ది కాంజురింగ్ (2013) మూవీ హెచ్ బిఒ మ్యాక్స్ లేదా హులు లో చూడొచ్చు. ప్ర...