భారతదేశం, జనవరి 6 -- సుమ-రాజీవ్ కనకాల వారసుడు రోషన్ కనకాల నటించిన రెండో సినిమా 'మోగ్లీ'. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సందీప్ రాజ్ (కలర్ ఫోటో ఫేమ్) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో నిరాశపరిచినా, ఓటీటీలో మాత్రం సునామీ సృష్టిస్తోంది. గతేడాది డిసెంబర్ 13న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కానీ డిజిటల్ స్ట్రీమింగ్ లోకి రాగానే ఊహించని రేంజ్ లో వ్యూస్ రాబడుతోంది.

'బబుల్ గమ్' తర్వాత రోషన్ కనకాల చేసిన ప్రయత్నం 'మోగ్లీ'. థియేటర్లో ఆడియెన్స్ పట్టించుకోకపోయినా.. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. చిన్న సినిమాలకు ఓటీటీనే అసలైన అడ్డా అని ఈ సినిమా మళ్ళీ నిరూపించింది. ప్రస్తుతం ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్ట్రీమింగ్ మొదలైన కేవలం 6 రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మైలురాయికి చేరుకుం...