భారతదేశం, నవంబర్ 3 -- ఒక దాని తర్వాత ఒకటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందిస్తూ, బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ సూపర్ స్టార్ హీరోయిన్ గా ఎదుగుతోంది రష్మిక మందన్న. ఆమె నటించిన లేటెస్ట్ హారర్ రొమాంటిక్ థ్రిల్లర్ 'థామా'. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు ఖాతాలో వేసుకుంది. మరి ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

రష్మిక మందన్న లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ థామా ఓటీటీ రిలీజ్ డేట్ పై క్రేజీ బజ్ నెలకొంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఇందు కోసం ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ కళ్లు చెదిరే రేట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 21న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది.

రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించిన థామా ఓటీట...