భారతదేశం, డిసెంబర్ 22 -- ఓటీటీలో గత వారం అంటే డిసెంబర్ 15 నుంచి 21 మధ్య ఎక్కువ వ్యూస్ సంపాదించిన టాప్ 5 సినిమాలు, టాప్ 5 వెబ్ సిరీస్ జాబితాను ఆర్మాక్స్ మీడియా సోమవారం (డిసెంబర్ 22) రిలీజ్ చేసింది. ఇందులో రష్మిక మందన్న నటించిన సినిమాలే టాప్ లో ఉండటం విశేషం.

ఓటీటీలో ప్రస్తుతం రష్మిక మందన్న నటించిన రెండు సినిమాలు దుమ్ము రేపుతున్నాయి. వాటిలో ఒకటి హారర్ కామెడీ మూవీ థామా కాగా.. మరొకటి ది గర్ల్‌ఫ్రెండ్. ఆర్మాక్స్ మీడియా ఈ జాబితాను రిలీజ్ చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న థామా (Thamma) మూవీ 3.1 మిలియన్ వ్యూస్ సాధించడం విశేషం.

ఇక రెండో స్థానంలోనూ రష్మిక సినిమానే ఉంది. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ 2.3 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇక మూడో స్థానంలో దుల్కర్ సల్మాన్ నటించిన కాంత ఉంది. ఈ సినిమా కూడా నెట...