భారతదేశం, నవంబర్ 28 -- రీసెంట్ గా తెలుగులో వచ్చిన సినిమాల్లో భారీ డిజాస్టర్ గా నిలిచిన సినిమాల్లో 'మాస్ జాతర' ఒకటి. రవితేజ హీరోగా వచ్చిన ఈ కాప్ యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలో దారుణమైన ప్రదర్శన చేసింది. రొటీన్ స్టోరీతో ఆడియన్స్ ను తీవ్రంగా డిసప్పాయింట్ చేసింది. కలెక్షన్లలో చెత్త రికార్డునూ ఖాతాలో వేసుకుంది. ఇవాళ (నవంబర్ 28) ఈ మూవీ ఓటీటీలో రిలీజైంది.

రవితేజ, శ్రీలీల జంటగా నటించిన పోలీస్ యాక్షన్ థ్రిల్లర్ మాస్ జాతర మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం (నవంబర్ 28) నుంచి ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది ఈ సినిమా. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమాను చూడొచ్చు.

మాస్ జాతర ఓటీటీ రిలీజ్ సందర్భంగా ఓ సారి ఈ మూవీ విశేషాలపై ఓ లుక్కేద్దాం. రవితేజ కెరీర్ లో ఇది 75వ సినిమా. క...