భారతదేశం, డిసెంబర్ 8 -- ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ప్రతి వారం కొత్తగా స్ట్రీమింగ్ అయ్యే సినిమాల్లో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 5 మూవీస్ జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 1 నుంచి 7 మధ్య కూడా అలాంటి మూవీస్ జాబితా వచ్చేసింది. వీటిలో జాన్వీ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ తొలి స్థానంలో ఉండటం విశేషం.

ఓటీటీలోకి ఈ మధ్యే స్ట్రీమింగ్ కు వచ్చిన జాన్వీ కపూర్ రొమాంటిక్ కామెడీ మూవీ సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా.. ఇప్పుడు ఓటీటీలో మాత్రం దూసుకెళ్తోంది. గత వారం ఎక్కువ వ్యూస్ సంపాదించిన సినిమా ఇదే కావడం విశేషం. 2.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

కొన్ని వారాలుగా టాప్‌లో ఉంటూ వస్తున్న కాంతార ఛాప్టర్ 1ను వెనక్కి నెట్టేసిందీ సినిమా. అమెజాన్ ప్రైమ్ వీ...