భారతదేశం, జనవరి 13 -- యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన 'హక్' (Haq) చిత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇదివరకే ఈ సినిమాపై ఎంతోమంది ప్రశంసలు కురిపించారు. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కూడా హక్ మూవీపై రివ్యూ ఇవ్వడమే కాకుండా ప్రశంసలు కురిపించింది.

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న హక్ మూవీపై సమంత స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రం తనను ఎంతగానో కదిలించిందని, చూస్తున్నంత సేపు అనేక భావోద్వేగాలకు లోనయ్యానని సామ్ పేర్కొంది.

ఒకేసారి కోపం, ప్రేమ, ఆశ.. అన్ని రకాల ఎమోషన్స్ కలబోతగా ఉందంటూ మంగళవారం (జనవరి 13) ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్టోరీతో సమంత 'హక్' చిత్ర బృందాన్ని అభినందించారు.

"హక్ సినిమా అయిపోయిన వెంటనే ఈ మాటలు రాయాలనిపించింది. ఎందుకంటే ఆ సినిమా నాలో కలిగించిన భావోద్వేగాలను కొంచెం కూడా కోల్పోకూడదని అనుకున...