Hyderabad, జూలై 20 -- ఓటీటీలోకి ఎన్నో ఊహించని డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆ సినిమాలన్నీ బాగా ఆదరణ దక్కడంతో సోషల్ మీడియా ట్రెండ్ అవుతుంటాయి. ఈ విధంగా అలాంటి ఓటీటీ సినిమాల్లో ఈ హారర్ థ్రిల్లర్ ఇటీవల సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.

ఆ సినిమానే కుమారి. 2022లో తెరకెక్కిన ఈ మలయాళ హారర్ థ్రిల్లర్ సినిమాలో సత్యదేవ్ గాడ్సే, మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమాల హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ టైటిల్ రోల్ పోషించింది. అలాగే, నాని దసరా విలన్ షైన్ టామ్ చాకో మరో కీ రోల్ చేశాడు. వీరితోపాటు స్వాసిక విజయన్, సురభి లక్ష్మీ, గిజు జాన్, రాహుల్ మాధవ్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

హారర్ ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కిన కుమారి సినిమా కథ అంతా కేరళలోని ఓ గ్రామంలో జరుగుతుంది. ఆ గ్రామంలోని కట్టుబాట్లు, సంప్రదాయాలు, మూఢ నమ్మకాలు, అతీంద్రియ శక్తులు వంటి అంశాలతో...