భారతదేశం, నవంబర్ 11 -- ఓటీటీలో ఎక్కువ మంది చూస్తున్న టాప్ 5 నాన్ ఫిక్షన్ షోస్ ఏవో తెలుసా? ఈ షోస్ విషయంలో జియోహాట్‌స్టార్ పంట పండిందనే చెప్పాలి. ఎందుకంటే టాప్ 5లో నాలుగు ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నవే. ఇక మూడు భాషలకు చెందిన బిగ్ బాస్ షోలు కూడా ఇందులో ఉండటం విశేషం.

సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ హిందీ సీజన్ 19 ఈ జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. ఈ షోకి గత వారం ఏకంగా 7 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. జియోహాట్‌స్టార్ లో ఈ షో స్ట్రీమింగ్ అవుతోంది. కొత్త సీజన్ ప్రారంభమైన తొలి వారం నుంచే టాప్ లో ఉంటూ వస్తోంది. ప్రతివారం వ్యూస్ పెరుగుతూనే ఉండటం విశేషం.

ఇది కూడా జియోహాట్‌స్టార్ ఓటీటీలో వస్తున్న షో. ప్రముఖ బాలీవుడ్ నటి సోనాలీ బింద్రే జడ్జిగా ఉన్న షో ఇది. దీనికి గత వారం 2.4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. రెండో స్థానంలో ఉన్నా కూడా.. బిగ్ బాస్...