Hyderabad, అక్టోబర్ 2 -- మలయాళం సినిమా మంచి థ్రిల్లర్లకు కేరాఫ్. అలాంటి ఇండస్ట్రీ నుంచి గతేడాది ఆగస్టులో వచ్చిన మూవీ చెక్‌మేట్ (Checkmate). ఈ మూవీకి థియేటర్లలో అంత మంచి రెస్పాన్స్ రాకపోవడంతో డిజిటల్ ప్రీమియర్ పై సందేహాలు నెలకొన్నాయి. అయితే మొత్తానికి ఇప్పుడు సుమారు 14 నెలల తర్వాత ఫ్రీగా స్ట్రీమింగ్ కు వచ్చింది.

మలయాళం థ్రిల్లర్ మూవీ చెక్‌మేట్ ఓటీటీ స్ట్రీమింగ్ జీ5 ఓటీటీలో అయింది. ఆ ఓటీటీ ఈ విషయాన్ని గురువారం (అక్టోబర్ 2) తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మొత్తానికి ఎదురు చూపులు ఫలించాయని, చెక్‌మేట్ ఇప్పుడు ఫ్రీగా జీ5లో స్ట్రీమింగ్ అవుతోందని తెలిపింది. అది కూడా మలయాళంతోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో డిజిటల్ ప్రీమియర్ అయింది.

ఈ వారం ఇప్పటికే మైనే ప్యార్ కియా, సాహసం, కొలాంబిలాంటి మరికొన్ని మలయాళం సినిమాలు కూడా స్ట్రీమింగ్ కు రాగా.. ...