భారతదేశం, నవంబర్ 14 -- ఓటీటీలోకి ఇవాళ ఓ మలయాళ హారర్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేసింది. ఫస్ట్ మలయాళ హారర్ కామెడీ సిరీస్ గా చెబుతున్న 'ఇన్‌స్పెక్ష‌న్ బంగ్లా' డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. శుక్రవారం (నవంబర్ 14)న ఈ సిరీస్ రిలీజైంది. మరి ఈ సిరీస్ ఏ ఓటీటీలో ఉందో ఇక్కడ చూసేయండి.

మలయాళం సినీ ఇండస్ట్రీ నుంచి డిఫరెంట్ సినిమాలు వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. రీసెంట్ గా లోకా మూవీ రికార్డులు బ్రేక్ చేసింది. మలయాళం సిరీస్ లు కూడా ఓటీటీలో అదరగొడుతూనే ఉంటాయి. ఇక ఇప్పుడు హారర్ కామెడీ జోనర్లో ఫస్ట్ మలయాళం సిరీస్ 'ఇన్‌స్పెక్ష‌న్ బంగ్లా' అని చెబుతున్నారు. దీంతో ఈ సిరీస్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సిరీస్ శుక్రవారం నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

మలయాళం నుంచి చాలా సిరీస్ లో ఓటీటీలోకి వచ్చాయి. అయితే హారర్ కామెడీ థ్రిల్లర్ జోనర్లో ...