భారతదేశం, డిసెంబర్ 26 -- ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్' లాస్ట్ టైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సిరీస్ చివరి సీజన్ అయిన సీజన్ 5 వాల్యూమ్ 2 ఇవాళ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ పార్ట్ తో స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ కు ఎండ్ కార్డు పడింది.

స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ (డిసెంబర్ 26) నుంచి ఇండియాలోని ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ హిట్ షో చివరి సీజన్.. హాకిన్స్ బృందాన్ని, వారి బలమైన శత్రువు వెక్నాను తిరిగి తీసుకు వచ్చింది. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25న విడుదలైంది. భారతదేశంలో మా...