భారతదేశం, మే 19 -- మోనికా పన్వర్, రజత్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఖౌఫ్' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు ముందే మంచి హైప్ తెచ్చుకుంది. ట్రైలర్ ఆకట్టుకోవడంతో అంచనాలు బాగా ఏర్పడ్డాయి. స్ట్రీమింగ్‍కు వచ్చాక కూడా ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సిరీస్‍కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మంచి వ్యూస్ సాధిస్తూ ముందుకు సాగుతోంది. ట్రెండింగ్‍లోనూ దుమ్మురేపుతోంది.

ఖౌఫ్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 18వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఆరంభం నుంచే ఈ సిరీస్‍కు మంచి వ్యూస్ దక్కాయి. దీంతో ట్రెండింగ్‍లోకి దూసుకొచ్చింది. కొన్ని రోజులు టాాప్ ప్లేస్‍లో నిలిచింది. ఆ తర్వాత కిందికి వచ్చింది. మొత్తంగా నెలరోజులుగా టాప్-10లోనే ఖౌఫ్ వెబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో ట్రెండ్ అవుతోంది.

ఖౌఫ్ వెబ్ సిరీస్‍లో ఎనిమిది ఎపిసోడ్లు వచ్చాయి. ఐదు భాషల్లో ఈ సిరీస్...