భారతదేశం, ఏప్రిల్ 29 -- మలయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్‍లాల్ నటించిన ఎల్2: ఎంపురాన్ బాక్సాఫీస్ సక్సెస్ సాధించింది. పృథ్విరాజ్ సుకుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించడంతో పాటు ఓ కీలకపాత్ర కూడా పోషించారు. ఈ హైవోల్టేజ్ యాక్షన్ మూవీ ఈ ఏడాది మార్చి 27వ తేదీన థియేటర్లలో రిలీజై దుమ్మురేపింది. లూసిఫర్‌ సీక్వెల్‍గా భారీ అంచనాలు ఉండగా వాటిని నిలుపుకుంది. ఇప్పుడు ఓటీటీలోనూ ఎల్2: ఎంపురాన్ దుమ్మురేపుతోంది.

ఎల్2: ఎంపురాన్ సినిమా ఏప్రిల్ 24న జియోహాట్‍స్టార్ ఓటీటీలోకి మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. బ్లాక్‍బస్టర్ హిట్ అయినా థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చింది. క్రేజ్‍తో స్ట్రీమింగ్‍కు వచ్చిన ఈ చిత్రానికి అన్ని భాషల్లో మంచి వ్యూస్ దక్కాయి.

జియోహాట్‍స్టార్ ఓటీటీలో ప్రస్తుతం (ఏప్రిల్ 29) ఎల్2: ఎంపురా...